ఆదిపురుష్ రేస్ నుంచి.. దిల్ రాజు తప్పుకున్నట్టేనా?

praveen
ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఆది పురుష్ అనే సినిమా జూన్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమాలో.. అటు రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండగా.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ టీజర్లకు అభిమానుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది అని చెప్పాలి. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసుకున్నా ప్రభాస్ ఆది పురుష్ సినిమా గురించి చర్చించుకుంటున్నారు.

 అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా ఎన్నో రోజులు లేని నేపథ్యంలో.. ఇక నేడు తిరుపతిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి రాబోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఈ మూవీ తెలుగు రైట్స్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది. ఏకంగా 185 కోట్లకు రైట్స్ దక్కించుకుంది అని చెప్పాలి. అయితే ఈ మూవీ రైట్స్ కోసం అటు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పోటీ పడ్డారు. నైజాం ఉత్తరాంధ్ర హక్కుల కోసం ఎక్కువ మొత్తంలోనే దిల్ రాజు ఆఫర్ చేశారట.

 కానీ దిల్ రాజు ఆఫర్ చేసిన దానికంటే ఎక్కువగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ముట్టజెప్పి ఇక ఆది పురుష్ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకుంది అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఈ సినిమా రైట్స్ విషయంలో దిల్ రాజు కాస్త వెనక్కి తగ్గారు అంటూ ఒక టాక్ వినిపిస్తుంది.  అయితే పెద్ద సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన అనుభవం దిల్ రాజుకు చాలానే ఉంది. ఇలా త్రిబుల్ ఆర్ సినిమాతో బాగానే లాగుపడ్డారు దిల్ రాజు. కానీ ఎందుకో ఆది పురుష్ సినిమా విషయంలో రిస్క్ చేయడానికి దిల్ రాజు సాహసం చేయలేకపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: