వర్షంతో ఫైనల్ రద్దయితే.. టైటిల్ విన్నర్ ఎవరో తెలుసా?

praveen
ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు.. ప్లే ఆఫ్ మ్యాచులను సవ్యంగా జరిగేందుకు కాస్త కటాక్షం చూపించిన వరుణ దేవుడు.. అటు ఫైనల్ విషయంలో మాత్రం కన్నెర్ర చేసాడు. ఎందుకంటే లీగ్ మ్యాచ్లు అన్ని సవ్యంగానే జరిగాయి. కానీ ఫైనల్ మ్యాచ్ నిర్వహణ విషయంలో మాత్రం వర్షం కారణంగా ఆటంకం ఏర్పడుతూనే ఉంది. వాస్తవానికి నిన్న ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వరుణ దేవుడు ఎంతకీ కటాక్షం చూపించలేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా ఇక రిఫరీలు మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక మ్యాచ్ పోస్ట్ ఫోన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి.

 అయితే ఏదైనా కారణంతో ఒకవేళ ముందుగా నిర్ణయించిన తేదీలో ఇక ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగకపోతే ఇక ఈ ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఒక రిజర్వు డే ఏర్పాటు చేస్తారు ఐపీఎల్ నిర్వాహకులు. ఈ క్రమంలోనే నిన్న వర్షం కారణంగా రద్దు అయిన ఫైనల్ మ్యాచ్ ఇక నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు అదే స్టేడియంలో జరగబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా ఫైనల్ మ్యాచ్ ఆలస్యం అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక అందరిలో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే నేడు జరగబోయే మ్యాచ్ కి కూడా వర్షం అంతరయం కలిగించే ఛాన్స్ ఉంది.

 60% వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే ఒకవేళ నేడు మ్యాచ్ జరిగితే ఓకే.. కానీ ఒకవేళ మ్యాచ్ జరగకుండా వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే నేడు జరగబోయే మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగిస్తే ముందుగా.. 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు రిఫరీలు. అది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ను ఎంచుకుంటారు అని చెప్పాలి. ఒకవేళ వర్షం మరింత ఇబ్బంది సృష్టిస్తే.. సూపర్ ఓవర్ కూడా నిర్వహించడం సాధ్యం కాకపోతే.. ఇక మ్యాచ్ను రద్దు చేస్తారు. ఆ సమయంలో ఇక పాయింట్స్ టేబుల్ లో టాపర్ గా ఉన్న జట్టునే టైటిల్ విన్నర్ గా ప్రకటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: