ఐపీఎల్ : అంతా అయిపోయాక.. ఇప్పుడు మెరుపులెందుకో?
అయితే ఇక ఇటీవలే ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయిన సన్రైజర్స్ జట్టు ఇక ఆ తర్వాత జరుగుతున్న మ్యాచ్లలో కూడా ఒత్తిడితో కనిపిస్తుంది.. తప్ప ఎక్కడ స్వేచ్ఛగా ఆడినట్లు మాత్రం కనిపించడం లేదు. అయితే ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే సన్రైజర్స్ తక్కువ పరుగులకే పరిమితమవుతుంది అనుకుంటున్నా సమయంలో జట్టులో స్టార్ బాట్స్మన్ గా ఉన్న క్లాసెస్ సూపర్ సెంచరీ తో మెరిసాడు. ఒకవేళ అతను సెంచరీ చేయకపోయి ఉంటే మాత్రం సన్రైజర్స్ దారుణమైన స్కోర్ కే పరిమితం అయ్యేది అని చెప్పాలి.
కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు 6 సిక్సర్ల సహాయంతో 14 పరుగులు చేశాడు క్లాసెస్. ఇతనికి తోడుగా బ్రూక్స్ 27 పరుగులు మార్కరమ్ 18 పరుగులతో సహకారం అందించారు అని చెప్పాలి. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాత బెంగళూరు జట్టు మాత్రం సన్రైజర్స్ బౌలర్ల పై వీర విహారం చేసి ఇక ఎంతో ఆలవోకగా టార్గెట్ చేదించి ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే క్లాసెస్ సెంచరీ పై స్పందిస్తున్న సన్రైజర్స్ అభిమానులు అంత అయిపోయాక ఇప్పుడు బ్యాటింగ్లో మెరుపులు మెరూపించడం ఎందుకు అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.