
ఇలా ఉంటే.. ఎంతటి బౌలర్ అయిన ఏం చేయలేడు : ధోని
దీంతో అటు రాజస్థాన్ రాయల్స్ కు కనీస పోటీ ఇవ్వలేక 32 పరుగుల తేడాతో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఇక ఇలా రాజస్థాన్ చేతిలో ఓటమిపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పిచ్ పై ఇంత టార్గెట్ ను చేదించడం అంటే కొంచెం కష్టతరమైన పనే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తొలి ఆరు ఓవర్లలో మా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. తర్వాత మిడిల్ ఓవర్లలో బౌలర్లు మంచి ప్రదర్శన చేసినప్పటికీ కొన్ని మిస్ ఫీల్డ్ కారణంగా పరుగులు వచ్చాయి.
పతిరానా బౌలింగ్ బాగానే ఉంది. అయితే ఇలా బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్న పిచ్ ఉన్నప్పుడు ఎంతటి బౌలర్ అయిన కూడా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంటూ మహేంద్ర సింగ్ ధోని చెప్పుకొచ్చాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించిందని ముఖ్యంగా యశస్వి జైస్వాల్, దృవ్ జూరేల్ లాంటి కుర్రాళ్ళు అద్భుతంగా ఆడారు అంటూ ప్రశంసలు కురిపించాడు మహేంద్రసింగ్ ధోని. ప్రతి మ్యాచ్ లో గెలుపు ఒక్కరికే దక్కుతుంది ఈరోజు ఆ గెలుపు రాజస్థాన్ దే అంటూ ధోని చెప్పుకొచ్చాడు. జైపూర్ అంటే తనకు చాలా ఇష్టమని.. నా కెరియర్ టర్నింగ్ పాయింట్ ఇక్కడ నుంచే మొదలైంది అంటూ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.