ఐపీఎల్ లో అదరగొడుతున్న యంగ్ ప్లేయర్స్.. టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ వీళ్ళే?

praveen
ఐపీఎల్ మొదలైంది అంటే చాలు వన్డే క్రికెట్ సందడి అంతా ఇంతా కాదు అని చెప్పాలి. క్రికెట్ లవర్స్ అందరికీ కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. అంతర్జాతీయ  క్రికెట్లో ప్రత్యర్ధులుగా ఉన్నవారు సహచరులుగా.. సహచరులుగా ఉన్నవారు ప్రత్యర్థులుగా మారిపోయి పోటీపడుతున్న నేపథ్యంలో ఇక ఈ పోరును చూసేందుకు అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే ఇక ప్రతి ఐపీఎల్ సీజన్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచడమే కాదు ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభను కూడా తెరమీదకి తీసుకువస్తూ ఉంటుంది.

 భారత క్రికెట్కు ఫ్యూచర్ స్టార్లను పరిచయం చేస్తూ ఉంటుంది ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్. ఇక 2023 ఐపీఎల్ సీజన్ సైతం ఇలాగే ఎంతో మంది యువ ఆటగాళ్ల అసమాన్యమైన ప్రతిభకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఐపీఎల్ లో బాగా రాణిస్తున్న ఆటగాళ్లు మరికొన్ని రోజుల్లో భారత్ జట్టు ఎంట్రీ వస్తారనే  భావన ప్రతి ఒక్కరిలో కలిగేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా ఈ ఏడాది ఐపిఎల్ లో అద్భుతమైన ప్రదర్శన ఆటగాళ్ల లిస్ట్ చూసుకుంటే..

 కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున రింకు సింగ్ అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. మొన్నటికి మొన్న కీలకమైన సమయంలో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా  ఐపీఎల్ హీరోగా మారిపోయాడు .

 ఋతురాజ్  గైక్వాడ్  : చెన్నై జట్టు తరఫున గత కొన్ని సీజన్ల నుంచి ఆడుతున్నారు. ఈ ఏడాది కూడా అదరగొడుతున్నాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియాలోకి వచ్చేలాగా కనిపిస్తున్నాడు.

 తిలక్ వర్మ  : మిగతా ఆటగాళ్ళ ప్రదర్శనతో సంబంధం లేకుండా అటు తిలక్ వర్మ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. దీంతో టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానే అని నిరూపిస్తున్నారు.

 సాయి సుదర్శన్  : ఈ ఐపీఎల్ ద్వారా తెరమీదకి  వచ్చి అసాధారణమైన  ప్రదర్శన చేస్తున్న ప్లేయర్లలో సాయి సుదర్శన్ ఒకరు. గుజరాత్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ అదరగొడుతున్నారు. ఇక బౌలర్లలో అటు రవి బిష్ణయ్ కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: