లక్నో జట్టుకు గుడ్ న్యూస్.. అతనొచ్చేస్తున్నాడు?

praveen
ఐపీఎల్ లో టైటిల్ గెలవడం లక్ష్యంగా బరిలోకి దిగిన కొన్ని జట్లకు ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి అన్న విషయం తెలిసిందే. జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగిన వారు గాయం బారిన పడుతూ ఇక జట్టుకు దూరమైన పరిస్థితి ఉంది. ఇక అటు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కూడా ఇక ఇలాంటి షాక్ తగిలింది అని చెప్పాలి. ఐపీఎల్ కు ముందే  మొహ్సిన్ ఖాన్ గాయం బారిన పడ్డాడు. ఇక అతను లేకుండానే లక్నో జట్టు ప్రస్తుతం మ్యాచ్లు ఆడుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు తమ తర్వాత మ్యాచ్ కి ముందు లక్నో జట్టుకి ఒక అదిరిపోయే శుభవార్త అందింది అని చెప్పాలి.



 గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఫేవర్ మొహ్సిన్ ఖాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడట. ఇక అతను త్వరలోనే లక్నో జట్టులో చేరబోతున్నాడు అన్నది తెలుస్తుంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే మొహ్సిన్ ఖాన్ తన భుజానికి శస్త్ర చికిత్స చేసుకున్నాడు. దీంతో ఇక ఐపీఎల్ మొత్తానికి అతను దూరంగా ఉంటాడు అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పట్టుదలతో అతను ఎంతో వేగంగా ఫిట్నెస్ సాధించాడు అన్నది తెలుస్తుంది. స్టార్ ఫేవర్ రాకతో ఇక లక్నో శిబిరంలో కొత్త జోష్ నిండిపోయింది అని చెప్పాలి.



 కాగా మొహ్సిన్ ఖాన్ పరీక్షించిన లక్నో వైద్య  బృందం అతను పూర్తిస్థాయి ఫిట్నెస్ తో ఉన్నాడు అన్న విషయాన్ని ధృవీకరించింది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఇక లక్నో జట్టులో మార్క్ వుడ్, వునాద్గత్, ఆవేశ్ ఖాన్, నవీన్ ఉల్ హక్ లాంటి అద్భుతమైన పేసర్లు ఉండగా.. ఇక వారికి తోడు మొహ్సిన్ ఖాన్ వచ్చి జట్టులో చేరితే ఇక తిరుగు ఉండదు అని చెప్పాలి. కాగా 2022 ఐపీఎల్ వేలంలో మొహ్సిన్ ఖాన్ ను కేవలం 20 లక్షలకు లక్నో కొనుగోలు చేసింది. కాగా గత ఏడాది అద్భుతమైన ప్రదర్శన చేసిన ఈ యువ ఫేసర్ 9 మ్యాచులు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: