RCB vs CSK: కోహ్లీ, ధోని ఫ్యాన్స్ కి పండగే?

frame RCB vs CSK: కోహ్లీ, ధోని ఫ్యాన్స్ కి పండగే?

Purushottham Vinay
ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో భాగంగా మరికాసేపట్లో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మధ్య మ్యాచ్ జరగనుంది.ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) లో జరుగుతున్న 24వ మ్యాచ్ ఇది. RCB హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చెన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.టాస్ గెలిచే జట్టు మొదట బౌలింగ్ ని ఎంచుకునే అవకాశం ఉంది.ఆర్సీబీ, సీఎస్కే టీమ్స్ రెండూ కూడా చాలా బలమైనవే.ఐపీఎల్ చరిత్ర కనుక చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. రెండు జట్లు కూడా ఇప్పటి దాకా ఐపీఎల్ లో నాలుగేసి మ్యాచులు ఆడాయి.వాటిల్లో రెండు జట్లూ రెండేసి మ్యాచుల చొప్పున గెలిచాయి.



 దీంతో ఆ రెండు జట్లకూ నాలుగేసి పాయింట్లు కూడా ఉన్నాయి. అయితే రన్ రేట్ పరంగా ఆర్సీబీ కంటే సీఎస్కే కాస్త ముందంజలో ఉంది.CSK పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఆర్సీబీ టీం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది.చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీం కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్. ఈ టీంలోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ధోనీ, కోహ్లీ అభిమానులకు ఈ మ్యాచ్ నిజంగా చాలా పెద్ద పండుగే.ప్రస్తుతం ఐపీఎల్ లో సీఎస్కే ఆడిన ఫస్ట్ మ్యాచు ఓడింది. రెండవ, మూడవ మ్యాచులో ఆ టీం గెలిచింది.తరువాత నాలుగో మ్యాచులో ఓడింది. మొత్తం రెండు మ్యాచుల్లో గెలిచి ఇంకా రెండింట్లో ఓడింది. ఇక ఆర్సీబీ ఫస్ట్ మ్యాచులో గెలిచింది. తర్వాతి రెండు మ్యాచుల్లో కూడా ఓడింది. తరువాత నాలుగో మ్యాచులో గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: