కెప్టెన్సీ తో.. ప్రపంచ రికార్డు సృష్టించిన బాబర్?
ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ఏకంగా సెంచరీ తో చలరేగిపోయాడు అని చెప్పాలి. లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని భావించింది. అయితే ఓపెనర్లలో మహమ్మద్ రిజ్వాన్ 50 పరుగులు సాధించగా.. కెప్టెన్ బాబర్ సెంచరీ తో చెలరేగాడు. 58 బంతుల్లో 11 ఫోర్లు మూడు సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు అని చెప్పాలి. ఇక చివర్లో ఇఫ్తికర్ అహ్మద్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి.
దీంతో ఇక 20 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అయితే లక్ష్య చేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టు మాత్రం నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 154 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 38 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అయితే ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో విజయం తర్వాత బాబర్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. తన కెప్టెన్సీలో జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన ప్లేయర్ గా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ సారథి అస్గర్ ల రికార్డ్ ను సమం చేశాడు. 42 విజయాలతో ప్రపంచ రికార్డు అందుకొని సమకాలీనులతో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. అంతకుముందు తొలి టి20 మ్యాచ్ లో విజయం తర్వాత అంతర్జాతీయ టి20 41 గెలుపులు నమోదు చేసి ధోని రికార్డును బద్దలు కొట్టాడు బాబర్.