కోహ్లీ పై విమర్శ.. కౌంటర్ ఇచ్చిన పాక్ మాజి?
కానీ ఎప్పటిలాగానే ఊహకందని రీతిలో పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతుంది. జట్టు ఏ మ్యాచ్ లో గెలుస్తుందో ఏ మ్యాచ్లో ఓడిపోతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇటీవలే లక్నో జట్టు చేతిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమి చవిచూసింది అన్న విషయం తెలిసిందే. అయితే లక్నోతో జరిగిన మ్యాచ్లో అటు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి అందరూ కొట్టినప్పటికీ ఈ హాఫ్ సెంచరీ చేయడానికి మాత్రం అతను ఎక్కువ బంతులు తీసుకున్నాడు అని చెప్పాలి.
దీంతో హాఫ్ సెంచరీ చేసిన అతని స్ట్రైక్ రేట్ మాత్రం మరి దారుణంగా ఉంది. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన కామెంటెటర్ సైమన్ అటు విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. విరాట్ కోహ్లీ లక్నోతో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడానికి ఎక్కువ బంతులు ఆడాడు అంటూ విమర్శలు గుప్పించాడు. అయితే సైమన్ వ్యాఖ్యలపై పాక్ మాజీ సల్మాన్ బట్ కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి. కోహ్లీ 75 అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. మైలురాళ్ల కోసం కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం విరాట్ కోహ్లీకి లేదు అంటూ సైమన్ కు చురకలు అంటించాడు సల్మాన్ బట్. బౌలర్ కావడం వల్లే బ్యాటింగ్ విషయంలో అతనికి అవగాహన లేదు అంటూ విమర్శించాడు.