ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఇప్పుడు ఐపీల్ ఫీవర్ తో నిండిపోయింది. ఒక వైపు ఐపీల్ సీజన్ మొదలవుతుంది అంటే చాలు చాలా దేశాల లీగ్ ల తో పాటు ఇంటర్నేషనల్ మ్యాచులు కూడా షెడ్యూల్ ని మార్చుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైం లో ఎప్పటి లాగానే మన ఇండియాలో జరుగుతున్న ఐపీల్ పై విషం కక్కేలా కొందరు పాకిస్థాన్ ఆటగాళ్ల వ్యాఖ్యానాలు ఉంటున్నాయి. తాజాగా పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎనిమిదవ సీజన్ టైటిల్ ని గెలుచుకున్న ముల్తాన్ సుల్తాన్స్ టీమ్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఐపీల్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు,.అయితే అతడు చేసిన వ్యాఖ్యలను ఆ దేశపు మరో ఆటగాడు డానిష్ కనేరియా ఖండించాడు. మన దేశం లో జరిగే మ్యాచులు లేదా లీగ్ లు గొప్పవి అని చెప్పుకోవడం లో ఎలాంటి తప్పు లేదు కానీ అందుకోసం ప్రపంచం లో అత్యుత్తమ లీగ్ గా జరుగుతున్న ఐపీల్ ని తక్కువ చేయడం సరి కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు, ప్రపంచం అంత కూడా ఇప్పుడు ఐపీల్ వైపు చూస్తుంది. ప్రపంచ ఫుట్ బాల్ లీగ్ కి సమానంగా ఐపీల్ ని తీసుకెళ్లడం లో బిసిసిఐ విజయం సాధించింది అంటూ కనేరియా వెల్లడించాడు. ఇంతకు కనేరియాకు ఈ విధంగా ఆగ్రహం వచ్చేలా రిజ్వాన్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి అంటే ప్రస్తుతం జరుగుతున్న PSL ని అందరు ఎంతో ఆసక్తిగా గామానితున్నారు. ఐపీల్ కంటే కూడా ఇది ఎంతో ఉత్తమ మైన లీగ్ అంటూ పేర్కొన్నాడు. దాంతో కనేరియా తన నోటికి పని చెప్పాడు. ఇక ఈ వ్యాఖ్యలపై అసలు మన ఇండియా నుంచి ఎవరు స్పందించలేదు. రిజ్వాన్ లాంటి వ్యక్తుల మాటలకూ స్పందించిన కూడా మన ఐపీల్ పరువు పోతుంది అనే రేంజ్ లో బిసిసిఐ దృఢమైన కాన్ఫిడెన్స్ తో వుంది.