విజయ్ చేస్తోంది కరెక్ట్ కాదు.. హీరోయిన్ ఫైర్..!
ఈ విషయాలపైన ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ కేసు ఏప్రిల్ 20న విచారణ జరగబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ తన భార్యకు రూ .250 కోట్ల రూపాయల భరణం కూడా ఇవ్వబోతున్నట్లు కోలీవుడ్ ఫిలిం వర్గాలలో ప్రచారం అయితే నడుస్తోంది. విజయ్ కి హీరోయిన్ తో ఉన్న సంబంధం వల్ల తమ మధ్య విభేదాలు వచ్చాయని గత ఐదేళ్లుగా మానసికక్షోభను అనుభవిస్తున్నట్లు రెండవ పిటిషన్ లో తెలియజేసింది. ఆమెతో ప్రేమాయణం నడుపుతూ తనకి నమ్మకం ద్రోహం చేశారని వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేసింది విజయ్ భార్య సంగీత.
ఈ క్రమంలోనే విజయ్ కి వీర అభిమాని అయిన నటి సనమ్ శెట్టి పలు సంచలన ఆరోపణలు చేశారు. ఇటివలె త్రిష, విజయ్ కలిసి ఒక వివాహానికి హాజరైన వీడియోని షేర్ చేస్తూ ఇది కరెక్ట్ కాదు.. భార్య బాధను కూడా కొంచెం పట్టించుకోకపోవడం విచారకం అంటూ.. ఎంతోకాలంగా అభిమానిస్తున్న మాలాంటి వారందరినీ కూడా మీరు తీవ్రంగా నిరాశ పరుస్తున్నారంటూ రాసుకొచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.