మిస్టర్ 360 సూర్యకు.. మిస్టర్ కూల్ ధోని టిప్స్.. ఇక దబిడి దిబిడేనా?

praveen
అంతర్జాతీయ టి20 క్రికెట్లో అటు అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. టీం లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ గా అవతరించాడు అన్న విషయం తెలిసిందే. ఇక టీమిండియా టి20 మ్యాచ్ ఆడుతుంది అంటే సూర్యకుమార్ లేకుండా అసలు బరిలోకి దిగదు అనేంతలా అభిమానుల్లో నమ్మకాన్ని కలిగించాడు అని చెప్పాలి. అంతేకాదు మైదానం నలువైపులా కూడా ఎంతో అలవోకగా షాట్లు ఆడుతూ.. ఇక నయా మిస్టర్ 360 ప్లేయర్ గా కూడా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులతో పిలిపించుకున్నాడు.

 ఇలా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎన్నో మెరుగైన ఇన్నింగ్స్ లు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. ఐసీసీ విడుదల చేసే టి20 ర్యాంకింగ్స్ లో ఎన్నో రోజుల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అలాంటి సూర్యకుమార్ యాదవ్ ఇక ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. మొన్నటి వరకు వన్డే ఫార్మాట్లో వరుసగా డకౌట్లు అయ్యి నిరాశపరిచాడు. అయితే సూర్యకుమార్ వైఫల్యం కేవలం వన్డే  ఫార్మాట్ కి మాత్రమే పరిమితం అవుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఇక ఇప్పుడు ఐపీఎల్ లో టి20 ఫార్మాట్లో కూడా అలాంటి వైఫల్యాలతోనే ఇబ్బంది పడుతున్నాడు.

 ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు వరకు ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో అయితే పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్ అయ్యి వెనుతిరిగాడు. దీంతో మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ కు ఏమైంది అంటూ అటు అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. అయితే డకౌట్ అయిన మిస్టర్ 360 సూర్యకుమార్ కు మిస్టర్ కూల్   మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ లో ఎన్నో టిప్స్ ఇచ్చాడు అన్నది తెలుస్తోంది. దీంతో ఇక ధోని ఇచ్చిన సలహాలను పాటించి అటు సూర్యకుమార్ తర్వాత మ్యాచ్లో అదరగొట్టడం ఖాయమని అభిమానులు నమ్మకం పెట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: