ఐపీఎల్ : చెత్త బ్యాటింగ్.. వీరికి జిడ్డు రత్న అవార్డు ఇవ్వాల్సిందే?
ఆ వివరాలు చూసుకుంటే.. ఈ లిస్టులో ముందు వరుసలో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్ల్లో కూడా స్లో బ్యాటింగ్ తో జట్టు విజయ అవకాశాలపై ప్రభావం చూపించాడు డేవిడ్ వార్నర్. మూడు మ్యాచ్ లలో 158 పరుగులు మాత్రమే చేసి ఆరెంజ్ క్యాప్ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. ఇందులో రెండు ఆర్ల సెంచరీలు ఉన్నాయి. అయితే అతను ఎన్ని పరుగులు చేసిన స్ట్రైక్ రేట్ మాత్రం 117 గా మాత్రమే ఉంది. టి20 ఫార్మాట్లో కనీసం 140కి పైగానే స్ట్రైక్ రేట్ ఉండేలా బ్యాట్స్మెన్లు జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ వార్నర్ మాత్రం జిడ్డు బ్యాటింగ్ తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇక డేవిడ్ వార్నర్ తర్వాత సన్రైజర్స్ బ్యాట్స్మెన్ హరి బ్రూక్స్, వాషింగ్టన్ సుందర్ లకి జిడ్డు రత్న ఇవ్వాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే 13.25 కోట్లు భారీ ధర పెట్టి హరి బ్రూక్స్ ని జట్టులోకి తీసుకుంది సన్రైజర్స్. కానీ ఒక్క సారి కూడా అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక ఆల్రౌండర్ గా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ ఎక్కడ బ్యాట్ తో ప్రభావం చూపించలేకపోతున్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు వాషింగ్టన్ సుందర్. దీంతో వీరి బ్యాటింగ్ చూసి సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.