సన్రైజర్స్ టీం లో.. ఇంపాక్ట్ ప్లేయర్ గా హీరో నాని?

frame సన్రైజర్స్ టీం లో.. ఇంపాక్ట్ ప్లేయర్ గా హీరో నాని?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ లో సరికొత్త రూల్ ను బీసీసీఐ తీసుకువచ్చింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రతి జట్టు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ రూల్ ఉపయోగించుకుని రెండు టీంలు కూడా తమ జట్టులో ఉన్న ఒక ఆటగాడిని ఏ క్షణంలో అయినా సరే రీప్లేస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ నిబంధనను అన్ని జట్లు కూడా ఎంతో బాగా వినియోగించుకుంటున్నాయ్ అని చెప్పాలి.



 ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా ప్రతిభ చాటడానికి అవకాశాలు దక్కుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇకపోతే ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని ఉపయోగించుకుని ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. నాచురల్ స్టార్ నాని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే నాని చేసిన ఒక పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్లలో  ఓడిపోయింది.


 ఇక ఇప్పుడు ఢిల్లీ జట్టుతో మ్యాచ్ ఆడుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అటు దసరా మూవీ టీం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకవేళ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇంపాక్ట్ ప్లేయర్ కోసం చూస్తున్నట్లయితే ధరణి ( నాని) సిద్ధంగా ఉన్నాడు అంటూ పోస్ట్ పెట్టింది. ఇతను బాక్సాఫీస్ వద్ద సెంచరీ (వంద కోట్లు కలెక్షన్స్) సాధించాడు అంటూ పేర్కొంది. ఈ మేరకు మూవీలో నాని క్రికెట్ ఆడిన ఫోటోని వీడియోని పోస్ట్ చేసింది. దీనిని రీ పోస్ట్ చేసిన నాని ఏమంటావు.. ఫీల్డ్ లో దుమ్ము రేపుతామ్ అంటూ కామెంట్ చేయడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: