అందుకే ఓడిపోతున్నాం.. సన్ రైజర్స్ కోచ్ కామెంట్?

praveen
సీజన్లు మారుతున్నాయి.. కెప్టెన్లు కూడా మారుతున్నారు. కానీ ఇప్పటివరకు ఆ జట్టు ప్రదర్శనలో మాత్రం అస్సలు మార్పు రావడం లేదు అని చెప్పాలి. ప్రతి సీజన్లో కూడా అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ దారుణమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తూ వస్తుంది ఆ టీమ్. ఇక జట్టు యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు అయితే ప్రతి ఒక్కరిని కూడా షాక్ కి గురి చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సైతం ఇలాంటి ప్రదర్శన కొనసాగిస్తుంది ఆ జట్టు.



 ఆ టీం ఏదో కాదు సన్రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ లో చెత్త ప్రదర్శనతో ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి. ఇప్పటివరకు అన్ని జట్లు కూడా రెండేసి మ్యాచ్ లు ఆడేసాయ్. ఒక మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ మరో మ్యాచ్లో మాత్రం అద్భుతంగా పుంజుకుని విజయం సాధించాయి అని చెప్పాలి. కానీ అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ఆడిన రెండు మ్యాచ్లలో కూడా ఓడిపోయి పాయింట్లు పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది అని చెప్పాలి. తొలి మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఇక రెండో మ్యాచ్లో లక్నో చేతిలో దారుణ పరాజయాలను  మూటగట్టుకుంది సన్రైజర్స్.



 అయితే హైదరాబాద్ జట్టు వరుస ఓటములపై ఆ జట్టు హెడ్ కోచ్గా ఉన్న బ్రియాన్ లారా స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశాడు అని చెప్పాలి. చెత్త బ్యాటింగ్ కారణంగానే సన్రైజర్స్ జట్టు ఓడిపోతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో మా బ్యాటింగ్ ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. తొలి మ్యాచ్లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయాం. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్ లో 7 బంతుల వ్యవధిలోని మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇక బ్యాటర్ల తీరు మారకుంటే మిగతా మ్యాచ్లో గెలవడం కూడా చాలా కష్టమె అవుతుంది అంటూ బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు. లోపాలు సరి చేసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి అంటూ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: