ఐపీఎల్ : ఆ విషయంలో చెన్నై నెంబర్.1?
దాదాపు అన్ని జట్లకు కూడా హోమ్ గ్రౌండ్ లో మంచి రికార్డులే ఉంటాయి. అయితే ఇక ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అయితే సొంత గడ్డపై తిరుగులేని రికార్డు ఉంది అన్నది ప్రస్తుతం తెరమీదకి వచ్చిన గణాంకాల ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇటీవలే మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అటు చెన్నై హోమ్ గ్రౌండ్ అయినా చపాక్ స్టేడియంలో జరిగింది అని చెప్పాలి. అయితే తొలి మ్యాచ్లో గుజరాత్ చేతిలో ఓడిపోయినప్పటికీ రెండో మ్యాచ్లో మాత్రం కలిసి వచ్చిన హోమ్ గ్రౌండ్ లో లక్నోపై చెలరేగి ఘనవిజయాన్ని అందుకుంది చెన్నై జట్టు.
ఇకపోతే ఇటీవల హోమ్ గ్రౌండ్ లో చెన్నై ఒక అరుదైన రికార్డును సృష్టించింది అని చెప్పాలి. ఐపిఎల్ లో అన్ని జట్లను పరిశీలిస్తే చెన్నై గెలుపు శాతం హోం గ్రౌండ్లో 72 శాతం వరకు ఉండడం గమనార్హం. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం మైదానంలో 61 మ్యాచ్లో అడగ 42 మ్యాచులలో విజయం సాధించింది. ఇక ఈ లిస్టులో అటు సన్రైజర్స్ 68.10% విజయాలతో తర్వాత స్థానంలో ఉంటే.. రాజస్థాన్ 68%, ముంబై ఇండియన్స్ 61.90, కోల్కతా 60.80, పంజాబ్ 54.30, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50.6, ఢిల్లీ 44.90 శాతంతో హోమ్ గ్రౌండ్లో సత్తా చాటిన జట్లుగా నిలిచాయి.