వారెవ్వా.. వరల్డ్ నెంబర్.1 గా మారిన రషీద్ ఖాన్?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమమైన బౌలర్ల లిస్టు తీస్తే అందులో మొదటి వరుసలో వినిపించే పేరు రషీద్ ఖాన్. ఈ ఆఫ్గనిస్తాన్ సంచలనం తన ఆట తీరుతో  తక్కువ సమయంలోనే స్టార్ ప్లేయర్గా ఎదిగాడ. అంతేకాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకొని ఇక అందరిని తన అభిమానులుగా మార్చుకున్నాడు అని చెప్పాలి. ఎలాంటి బ్యాట్స్మెన్ ను అయినా సరే తన స్పిన్ బౌలింగ్ తో తికమక పెట్టి వికెట్ తీయగల సత్తా రషీద్ ఖాన్ సొంతం అని చెప్పాలి.

 అలాంటి రషీద్ ఖాన్ అటు ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. మరీ ముఖ్యంగా ఇక కొన్నేళ్లపాటు అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇక గత కొంతకాలం నుంచి అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్న రషీద్ ఖాన్ ఇక ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా కొల్లగొడుతూ దూసుకుపోతూ ఉన్నాడు. ఇక ఇటీవలే  ఏకంగా వరల్డ్ నెంబర్వన్ ర్యాంకును కూడా కొల్లగొట్టాడు ఈ ఆఫ్ఘనిస్తాన్ సంచలనం. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు అని చెప్పాలి.

 ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ చూసుకుంటే ఏకంగా 710 రేటింగ్ పాయింట్స్ తో ఆఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇక రషీద్ ఖాన్ తర్వాత శ్రీలంక ప్లేయర్ హసరంగ 695 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు అని చెప్పాలి.  ఇక మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఫారుకి 692 పాయింట్లతో మూడవ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ప్లేయర్ జోస్ హెజిల్ వుడ్ 690 పాయింట్లతో నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా రషీద్ ఖాన్ ఇలా టాప్ ర్యాంకును సొంతం చేసుకోవడంతో అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: