పాపం.. పాక్ ప్లేయర్.. అత్యంత చెత్త రికార్డు?

praveen
ఒక్కోసారి క్రికెట్ లో అద్భుతాలు జరుగుతాయి. అదే విధంగా కొన్ని చెత్త రికార్డ్స్ కూడా నమోదు అవుతూ ఉంటాయి. ఆలా చాల జట్లకు అనేకసార్లు చెత్త రికార్డ్స్ నమోదు చేసిన రికార్డు ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అలంటి ఒక సంఘటన జరిగింది. ఇంటెర్నేషనల్ t20 లో ఒక చెత్త రికార్డు నమోదు అయ్యింది. ప్రస్తుతం పాకిస్థాన్ వర్సెస్  ఆఫ్గానిస్తాన్‌ టీ20 సిరీస్ జరుగుతుంది.  అయితే ఈ సిరీస్ లో భాగంగా జరిగిన రెండవ మ్యాచు లో డకౌట్ అయి వరసగా నాలుగు సార్లు డకౌట్ అయినా ప్లేయర్ గా ఒక చెత్త రికార్డు లోకి ఎక్కాడు పాకిస్థాన్ ఆటగాడు అబ్దుల్లా షఫీక్.
 వరసగా ఆడిన నాలుగు మ్యాచ్చులో అబ్దుల్లా షఫీక్ డకౌట్ కావడం తో ఈ రికార్డు నమోదు చేసిన మొదటి ప్లేయర్ గా అబ్దుల్లా షఫీక్ రికార్డు సృష్టించాడు. ఇక ఆదివారం రోజు జరిగిన రెండో టీ20లో గోల్డన్‌ డకౌటైన షఫీక్ అంతకు ముందు జరిగిన t20 మ్యాచ్ లో కూడా డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే అంతకు ముందు న్యూజిలాండ్ తో రెండు మ్యాచులు జరగగా ఆ రెండు మ్యాచుల్లో కూడా అబ్దుల్లా షఫీక్ డకౌట్ అయ్యి ఇలాంటి ఒక రికార్డు మూట గట్టుకున్నాడు.

 ఇక మరో విశేషం ఏమిటి అంటే ఇప్పటి వరకు కేవలం ఐదు t20  మ్యాచులు మాత్రమే ఆడిన షఫీక్ నాలుగు మ్యాచుల్లో అవుట్ అయ్యాడు. ఇప్పటి వరకు t20 మ్యాచుల్లో మొత్తంగా 7 పరుగులు మాత్రమే నమోదు చేసాడు. ఇక ఇప్పటి వరకు మూడు మ్యాచులు డకౌట్ అయినా రికార్డు ఇండియన్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ పేరు మీద ఉంది. అతడికి మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ అనే ముద్దు పేరు కూడా ఉంది. ఇక పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్‌ మూడు మ్యాచుల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది ఆఫ్గాన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: