ఆ క్షణం.. కళ్ళల్లో నీళ్లు ఆగలేదు : డివిలియర్స్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన జట్టుగా కొనసాగుతుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవక పోయినప్పటికీ ఇక ఈ జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు అని చెప్పాలి. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు సైతం అదే రీతిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పడంతో అతిశయోక్తి లేదు.

 ఇలా బెంగళూరు జట్టులో ఆడటం ద్వారా ఊహించని రీతిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో మిస్టర్ 360 ప్లేయర్ ఎ బి డివిలియర్స్ తో పాటు యూనివర్సల్ బాస్ గా ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు గెలుచుకునే క్రిస్ గేల్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఇక వీరిద్దరూ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిథ్యం  వహించి ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ లతో జట్టును గెలిపించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్టుకి ఆడి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీరికి ఇక ఇప్పుడు బెంగుళూరు జట్టు యాజమాన్యం ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చింది.

 క్రిస్ గేల్, ఎబిడి లను హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చింది బెంగళూరు యాజమాన్యం. అంతేకాదు వీరిద్దరి జెర్సీ నెంబర్ మరొకరు వాడకుండా రిటైర్  చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయంపై ఎబి డివిలియర్స్ సోషల్ మీడియాలో స్పందించాడు. ఆర్సిబి హాల్ ఆఫ్ ఫేమ్ లో గేల్ తో పాటు నా పేరు కూడా చేర్చారు. నా జెర్సీ నెంబర్ 17, గేల్ జెర్సీ నెంబర్ 333 ని కూడా రిటైర్ చేశారు. కుటుంబంతో సహా ఆర్సిబి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు భిన్న అనుభూతిని పొందాను. మా డ్రెస్సింగ్ రూమ్ లో బాల్కనీలోకి వెళ్ళినప్పుడు ఏబీడీ అనే నినాదాలు మళ్లీ విని కళ్ళు చేమర్చ్చాయి. నా జట్టుకు ఫ్రాంచైజీకి అమితమైన ప్రేమ పంచే అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. భారత్లో ఎన్నో అమూల్యమైన రోజులు గడిపాను అంటూ ఏపీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: