ఐపీఎల్ : రోహిత్ శర్మ దూరం.. కెప్టెన్గా సూర్యకుమార్?

praveen
మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది అటు లీగ్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ఏడాది పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఈసారి మాత్రం తప్పకుండా కప్పు కొడుతుందని  అందరూ అనుకుంటున్నారు. అయితే గత సీజన్ వరకు కేవలం ముంబై ఇండియన్స్ కు మాత్రమే కెప్టెన్ గా ఉన్న రోహిత్ ఇక ఎప్పుడూ టీమ్ ఇండియాకు కూడా సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

 దీంతో ఐపీఎల్ కంటే అటు టీమిండియా గురించి అతను ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఉండడం.. ఇక ఆ తర్వాత ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో  రోహిత్ శర్మ ఐపిఎల్ లో అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై కూడా గత కొంతకాలం నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఆడటం గురించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నది మాత్రం తెలుస్తుంది.

 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకొని.. ఇక అటు వర్క్ లోడ్ నుంచి గాయాల బెడద నుంచి తప్పించుకోవాలని రోహిత్ శర్మ అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఐపిఎల్ లో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు బదులు సూర్య కుమార్ యాదవ్ కు సారధ్య బాధ్యతలు అప్పగిస్తారట. రోహిత్ మ్యాచ్ ఆడకపోయినప్పటికీ డగ్ అవుట్ లో కూర్చుని  ఒకవైపు జట్టును.. మరోవైపు సారధ్య బాధ్యతలు నిర్వహించే సూర్య కుమార్ యాదవ్ను గైడ్ చేస్తూ ఉంటాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: