కోల్ కత్తా జట్టుకు మరో ఎదురు దెబ్బ.. ఇక అంతే సంగతి?

praveen
గత ఏడాది జరిగిన మినీ వేలంలో కొత్త ఆటగాళ్లను కోట్లు కుమ్మరించి మరి కోల్కతా జట్టు తమ టీమ్ లోకి తీసుకుంది. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని లక్ష్యంతో బలిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఇక ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ కి ఊహించని విధంగా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటికే జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతనికి సర్జరీ అవుతుండడంతో దాదాపు ఇంకా ఏడు నుంచి ఎనిమిది నెలల వరకు క్రికెట్ కి దూరం కానున్నాడు.

 దీంతో కోల్కతా జట్టు యాజమాన్యం కొత్త కెప్టెన్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలాంటి సమయంలో ఇక ఇటీవలే మరో ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే. కోల్కతా జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న ఫెర్గ్యూసన్ సైతం ఇక గాయం కారణంగా దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక కోల్కతా జట్టుకు కీలక బౌలర్ లేకుండా పోయాడు. ఇక ఈ రెండు ఎదురుదెబ్బలు చాలవు ఉన్నట్లు ఇక ముచ్చటగా మూడోసారి  కోల్కతా జట్టుకు ఊహించిన షాక్ తగిలింది. కోల్కతా జట్టులో కీలక బ్యాటర్ గా కొనసాగుతున్న నితీష్ రానా సైతం ఇక గాయం కారణంగా జట్టుకు అందుబాటులో ఉండడం లేదు అన్నది తెలుస్తుంది.

 ఇలా అటు కోల్కతా జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది అని చెప్పాలి. ఇలా కీలక ఆటగాళ్లు దూరం అవుతూ ఉన్న నేపథ్యంలో ఈసారి ఐపీఎల్ సీజన్లో కోల్కతా జట్టు బాగా రాణించడం మాత్రం కష్టమే అని ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.. అయితే ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెన్ననొప్పి గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో  అతని స్థానంలో విండీస్ స్టార్ ఆల్ రౌండర్ అయిన సునీల్ నరైన్ కి కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అతనితో పాటు న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్ టీమ్ సౌదీ కూడా ఇక కోల్కతా జట్టు కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: