
వైరల్ : ఫుట్ బాలర్ అసభ్య ప్రవర్తన.. యువతిని అసభ్యంగా తాకుతూ?
ఇక ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే మంచేస్టర్ సిటీ, న్యూ కాసిల్ మధ్య ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మంచేస్టర్ సిటీ టీం గెలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ జట్టు సభ్యుడు కైల్ వాకర్ స్నేహితులతో కలిసి దగ్గరలో ఉన్న బార్కు వెళ్లి ఫుల్లుగా మద్యం సేవించాడు. ఇక అక్కడ ఉన్న ఇద్దరు యువతులతో మాట్లాడటం మొదలుపెట్టాడు. కాసేపటికి మద్యం మత్తులో ఇద్దరిలో ఒక యువతిని దగ్గరగా తీసుకొని అసభ్యంగా తాకుతూ ముద్దుల్లో ముంచేసాడు.
అయితే అక్కడ ఉన్న యువతి కూడా ఇక మద్యం మత్తులో ఉండడంతో పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పాలి. ఇక ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై అటు బార్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసాడు అని చెప్పాలి. సమాచారం అందుకున్న పోలీసులు బార్ కు వచ్చి సీసీటీవీ పరిశీలించారు. ఆ తర్వాత కైల్ వాకర్ను పిలిపించి విచారణ జరిపారు. ఇక సదరు యువతీని కూడా పిలిపించి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అయితే అప్పుడు తాను మద్యం మత్తులో ఉన్నానని అతను అలా ముద్దు పెట్టిన పెద్దగా పట్టించుకోలేదని.. ఇక అతను నన్ను బలవంతం చేయలేదు అంటూ యువతీ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇక ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో ఖైల్ వాకర్ను అరెస్టు చేయకుండా వదిలేశారు పోలీసులు.