అందులో ఎలాంటి సందేహం లేదు.. టీమిండియా గెలుపుపై హర్భజన్?
మొదటి మ్యాచ్ లో 132 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది అని చెప్పాలి. కాగా ఇంకా ఆస్ట్రేలియా భారత్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా మూడవ టెస్ట్ మ్యాచ్లో గెలిచింది అంటే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఈ రెండు మ్యాచ్లలలో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై అటు టీమిండియా మాజీ ఆటగాడు హార్బర్జన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టును ఆతిథ్య టీమిండియా 4-0 తేడాతో క్లీన్ స్వేప్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయపడ్డాడు హర్భజన్ సింగ్. ఈ విషయంలో తనకు ఎలాంటి సందేహం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇది పది మ్యాచ్ల సిరీస్ అయితే ఆస్ట్రేలియా కు ఎలాంటి ఫైర్ పవర్ ఆటగాడు లేనందున.. భారత్ 10-0 తేడాతో గెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.