కేఎల్ రాహుల్ కి షాక్.. మిగతా రెండు టెస్టులకు వైస్ కెప్టెన్ గా జడేజా?
బాగా రాణించనప్పుడు ఫామ్ లో ఉన్న ఆటగాడిని జట్టులోకి తీసుకోవాల్సింది పోయి మళ్ళీ అతనికి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు అంటూ ఎంతోమంది మాజీ ఆటగాళ్లు మాత్రమే కాదు క్రికెట్ ప్రేక్షకులు కూడా బీసీసీఐ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.. ఇకపోతే ప్రస్తుతం వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ కు ఇటీవల బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది. టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో ఆడబోయే వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నప్పటికీ వైస్ కెప్టెన్సీ మాత్రం అటు హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.
అయితే ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వైస్ కెప్టెన్సీ మాత్రమే కాదు టెస్ట్ ఫార్మాట్లో వైస్ కెప్టెన్సీ కూడా మరొకరికి అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. రెండు టెస్టులకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాకుండా మూడో టెస్ట్ నుంచి మాత్రం వైస్ కెప్టెన్ గా తొలగించబోతున్నట్లు సమాచారం. మిగిలిన రెండు టెస్టులకు వైస్ కెప్టెన్ గా ఎవరు అయితే బాగుంటుంది అని విషయంపై పూర్తి హక్కులు కూడా రోహిత్కే ఇచ్చారట. అయితే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా ఉంటే బాగుంటుందని రోహిత్ కూడా అభిప్రాయపడ్డాడట. దీంతో ఇక జడేజాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది.