రోహిత్ రికార్డును బ్రేక్ చేసిన.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్?

praveen
ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. నువ్వా నేనా అంటూ జరుగుతున్న పోరు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అని చెప్పాలి. ఇకపోతే వరల్డ్ కప్ లో భాగంగా ఎంతో మంది ప్లేయర్లు మంచి ప్రదర్శన చేస్తూ ఇక ఎన్నో అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. పురుష క్రికెటర్లు సాధించిన రికార్డులను సైతం తమ ఆట తీరుతో బద్దలు కొడుతున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్ట్రేలియా మహిళల జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న ఎల్లిస్ పెర్రి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది అని చెప్పాలి. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్ గా ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. మహిళల ప్రపంచకప్ లో భాగంగా ఇటీవలే దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో ఆడిన ఎల్లిస్ పెర్రి ఇక ఈ ఘనతను తన పేరుట లికించుకుంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు  టి20 ప్రపంచ కప్ లో ఎల్లిస్ పెర్రి  45 మ్యాచ్లు ఆడింది అని చెప్పాలి. అయితే అంతకుముందు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ శర్మ టి20 వరల్డ్ కప్ లో 39 మ్యాచులు ఆడాడు.

 ఇక ఇప్పటివరకు ఇదే అత్యధికంగా ఉండగా.. ఇక ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రి మాత్రం రోహిత్ రికార్డును బ్రేక్ చేసేసింది. అంతేకాకుండా టి20 ప్రపంచ కప్లో 1500 పరుగులతో పాటు 100 వికెట్లు సాధించిన మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్ గా కూడా ఒక అరుదైన ఘనత సాధించింది అని చెప్పాలి. దీంతో ఇక ఎల్లిస్ పెర్రిపై  ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే హోరహోరీగా జరిగిన పోరులో దక్షిణాఫ్రికా పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఇక ఈ మెగా టోర్నీలో ఇది ఆస్ట్రేలియాకు వరుసగా నాలుగో విజయం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: