
దిమ్మతిరిగే ఆటతో సెమీస్ చేరిన ఆస్ట్రేలియా... మరో టైటిల్ పై గురి !
అయితే కాసేపటి క్రితమే ఆస్ట్రేలియా మరియు శ్రీలంక ల మధ్యన ముగిసిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా వికెట్ల తేడాతో శ్రీలంక ను ఓడించి ఈ టోర్నీలో సెమీస్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ప్రత్యర్థులను చిత్తు చేసి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్ బెర్త్ ను కంఫర్మ్ చేసుకుంది. మ్యాచ్ కు ముందు వరకు ఈ రెండు జట్లలో ఎవరు గెలిస్తే వారు సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంది. అలా బరిలోకి దిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ లానింగ్ ఫీల్డింగ్ తీసుకుంది. టాస్ ఓడిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ లో నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో మేగాన్ షూట్ 4 వికెట్లతో చెలరేగి శ్రీలంక పతనాన్ని శాసించింది. 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేధనను స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు బెత్ మూనీ 56 పరుగులు మరియు అలిసా హీలీ 53 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు. వీరిద్దరూ నెమ్మదిగా ఆడుతూ జట్టును విజయం వైపు నడిపించారు. వీరిద్దరో మరో వికెట్ పడకుండా వికెట్ల తేడాతో శ్రీలంకను మట్టి కరిపించి సెమీస్ లో ఘనంగా అడుగుపెట్టారు. ఇప్పటికే టీ 20 వరల్డ్ కప్ లను గెలుచుకోగా మరోసారి టైటిల్ పై కన్నేసింది.