ఫుట్ బాల్ మ్యాచ్లో విషాదం.. భీమిలి కబడ్డీ జట్టు సీన్ రిపీట్?

praveen
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు అనే సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.  ఇక ఈ సినిమాలో చివర్లో కబడ్డీ ఆడుతూ తన జట్టును గెలిపించిన నాని ఇక అక్కడికక్కడే గుండె ఆగి చనిపోతాడు. అయితే సినిమాల్లోనే ఇలాంటివి జరుగుతాయి నిజ జీవితంలో ఇలాంటివి జరగవు అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. కానీ నిజ జీవితంలో కూడా క్రీడల్లో ఇలాంటి విషాదాలు చోటు చేసుకుంటూ ఇక ఎంతోమందిక్రీడ అభిమానులను విషాదంలో ముంచేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే ఒక ఫుడ్ బాల్ మ్యాచ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది.


 దీంతో ఎంతోమంది క్రీడా అభిమానులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక ఆటగాడు తన జట్టును గెలిపించేందుకు ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టాడు. ఏకంగా సక్సెస్ఫుల్గా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కొట్టిన గోల్ ఆపిన సదరు ప్లేయర్... ఇక ఆ తర్వాత కాసేపటికి కుప్పకూలిపోయాడు. ఇక వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది అతని ఆసుపత్రికి తరలించగా.. హార్ట్ ఫెయిల్ అవ్వడం కారణంగా చనిపోయాడు అన్న విషయాన్ని నిర్ధారించారు.  దీంతో ఇక క్రీడాభిమానులు విచారంలో మునిగిపోయారు. బెల్జియం లో జరిగిన ఒక ఫుట్బాల్ మ్యాచ్ లో ఈ విషాదకర  ఘటన చోటుచేసుకుంది.


 వింకిల్ స్పోర్ట్స్ బి.. వెస్ట్రో జెబ్కె మధ్య జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో వింకిల్ స్పోర్ట్స్ 2-1 గోల్స్ తో ఆధిక్యంలో ఉంది.అయితే చివర్లో వెస్ట్రో జెబ్కెకు పెనాల్టీ కార్నర్ లభించింది అని చెప్పాలి. అయితే ఈ సమయంలోనే జట్టును గెలిపించేందుకు గోల్ కీపర్ ఆర్నె ఎస్పీల్ ప్రయత్నించాడు. ప్రత్యర్థి  ఆటగాళ్లు కొట్టిన బంతిని గోల్ వెళ్లకుండా అద్భుతంగా ఆపాడు. అయితే కొద్దిసేపటికి అతను మైదానంలో కుప్ప కూలిపోయాడు. వెంటనే వైద్యుల ఆసుపత్రికి తరలించగా.. హార్ట్ ఫెయిల్ అయి మరణించినట్లు నిర్ధారించారు.. అతని మరణంపై ఎంతోమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: