పాకిస్తాన్ పై దంచికొట్టింది.. వేలంలో ఊహించని ధర?
ఈ క్రమంలోనే పురుష క్రికెటర్లకు ఎక్కడ తక్కువ కాదు అనే రేంజ్ లోనే ఎంతో మంది మహిళా క్రికెటర్లు కోట్ల రూపాయల ధర పలికారు. అయితే ఇటీవలే జరిగిన మెగా వేలంలో ఏకంగా భారత యువ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ రిచా గోష్ జాక్పాట్ కొట్టేసింది అని చెప్పాలి. ఏకంగా ఇటీవల జరిగిన వేలంలో రిచా ఘోష్ ను 1.9 కోట్లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. ఈ ప్లేయర్ ను దక్కించుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది అని చెప్పాలి.
అయితే చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 1. 9 కోట్ల భారీ ధర పెట్టి ఈ ప్లేయర్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ వేలంలో రిచాగోష్ కనీస ధరను 50 లక్షలు గా రిజిస్టర్ చేసుకుంది అని చెప్పాలి. అయితే రిచా ఘోష్ కి ఇంత భారీ ధర పలకడానికి కారణం ఇటీవలే సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే బ్యాటింగ్ ప్రదర్శన చేయడమే అన్నది తెలుస్తుంది. పాకిస్తాన్తో టీమిండియా ఆడిన మొదటి మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ ఆడింది రీఛాగోష్. 20 బంతుల్లో 31 పరుగులు చేసింది. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. ఇక దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్ లో కూడా దుమ్మురేపింది రిచా ఘోష్.