కేఎల్ రాహుల్ ని.. ఎవరు టచ్ చేయలేరు?

praveen
టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ గత కొంతకాలం నుంచి మాత్రం వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న ఆటగాడు ప్రతి మ్యాచ్ లో కూడా ఎంతో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాల్సింది పోయి సింగల్ డిజిట్ స్కోర్కె వికెట్ కోల్పోతూ ఇక అభిమానులను సైతం నిరాశ పరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే టీ20 ఫార్మాట్లో టెస్ట్ ఫార్మాట్లో నిరాశ పరుస్తున్న కేఎల్ రాహుల్ వన్ డే ఫార్మాట్ లో మాత్రం నిలకడగా రాణిస్తూ ఉండడం గమనార్హం.


 ఇలా ఇక తన పేలవమైన ప్రదర్శన కారణంగా ఏకంగా అతన్ని మెచ్చుకున్న వారే విమర్శలు చేసే పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. అయితే ఇక కోల్కతా వేదికగా జరిగిన భారత్ శ్రీలంక రెండో వన్డే మ్యాచ్లో మాత్రం కీలక ఇన్నింగ్స్ సాడి విమర్శకులకు సరైన సమాధానం చెప్పాడు. రిషబ్ పంతులేని సమయంలో ఐదవ స్థానంలో బ్యాటింగ్కు దిగిన కేఎల్ రాహుల్ ఇక తొలి మ్యాచ్ లో లో తక్కువ స్కోరుకే పరిమితం అయినప్పటికీ రెండో వన్డే మ్యాచ్లో మాత్రం జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు. 64 పరుగులతో అజయంగా నిలిచాడు.


 కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ గురించి మాజీ ఆటగాడు వసీం జాఫర్ ప్రశంసల కురిపించాడు. ప్రతి ఒక్కరు అన్ని ఫార్మాట్లు కలిపి మాట్లాడేస్తూ ఉంటారు. రాహుల్ వన్డే ఫార్మాట్లో ఎంతో నిలకడగా రాణిస్తున్నాడు. ఇక అతను ఇలాగే కొనసాగితే భారత జట్టులో అతని చోటుకు ఎలాంటి డోకా ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఫిట్ గా ఉంటే కేవలం రిషబ్ పంత్ మాత్రమే కేఎల్ రాహుల్ స్థానానికి పోటీ ఇవ్వగలడు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక మిగతా ఏ ఆటగాడు కూడా  రాహుల్ స్థానాన్ని టచ్ చేయలేడు అంటూ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: