చిరంజీవి ఎత్తుకున్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు హీరో తెలుసా?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించి కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడు అందరూ ఆసక్తి చూపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి విషయం ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు నిమిషాల్లో అది వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అంతేకాదు ఇక స్టార్ హీరోలకు సంబంధించిన పాత ఫోటోలని ఎంతో అపురూపంగా భావిస్తూ ఉంటారు అభిమానులు. ఇక ఇలాంటి ఫోటో సోషల్ మీడియాలోకి వస్తే అది చూసి మురిసిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక అప్పుడప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు వీడియోలు బయటికి వస్తూ ఉంటాయి అని చెప్పాలి.



 అయితే ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఒక బుడ్డోడిని ఎత్తుకున్న ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఆ బుడ్డోడు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగానే ఏకంగా పూలదండ వేయించుకుని.. ఒక షీల్డ్ కూడా అందుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త వైరల్ గా మారిపోవడంతో.. ఈ ఫోటోలో ఉన్నది ప్రస్తుతం టాలీవుడ్ లో యువ హీరోగా కొనసాగుతున్న ఒక నటుడు అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ అతను ఎవరో తెలుసా.. విలక్షణ నటుడిగా ఎంతగానో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్.


 ఇటీవలే చిరంజీవి తనను ఎత్తుకున్న ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఆది. దీంతో అభిమానులు ఇది చూసి మురిసిపోతున్నారు. అంతేకాదు ఈ ఫోటో ద్వారా మెగాస్టార్ చిరుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు ఆది సాయికుమార్. అయితే గతంలో ఆది నటించిన మొదటి సినిమా ప్రేమ కావాలి సమయం లో చిరంజీవి సైతం రంగంలోకి దిగి ప్రమోషన్ చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆది సాయికుమార్ రెండు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఓ సినిమా షూటింగ్  సమయంలో  ఈ ఫోటోని తీసారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: