మాకు రెస్పెక్ట్ కావాలి.. ఇవ్వండి : రమిజ్ రజా

praveen
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న రమిజ్ రజా ను ఇటీవల బోర్డు పెద్దలు చివరికి పదవి నుంచి పీకి పారేశారు అన్న విషయం తెలిసిందే. అయితే పదవి పోయిన ఇంకా రమిజ్ రజా అటు బిసిసిఐపై, భారత ఆటగాళ్లపై నోరు పారేసుకోవడం మాత్రం ఆపడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ అక్కస్సును వెలగక్కుతూనే ఉన్నాడు. ఇటీవల భారత కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కు ప్రమోషన్ ఇవ్వడం పై స్పందిస్తూ పాకిస్తాన్ భారత్ కంటే మంచి ప్రదర్శన చేయడం కారణంగానే కెప్టెన్ ను మార్చారంటూ గొప్పలకు పోయాడు రమిజ్ రజా.


 ఇక ఇప్పుడు మరోసారి తన అక్కసును వెలగక్కుతూ  తాము బీసీసీఐకి సర్వెంట్లము కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే.. 2023 ఏడాదిలో పాకిస్తాన్ ఆసియా కప్కు ఆతిథ్యం ఇస్తుంది. అయితే తాము తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహిస్తేనే టోర్నీలో పాల్గొంటామని పాకిస్తాన్ కు వెళ్ళేది లేదు అంటూ బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా స్పష్టం చేశారు. ఇటీవల దీనిపై మాట్లాడిన రమిజ్ రజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇదేమి నాయకత్వం.. వెంటనే ఎసిసి బోర్డు సమావేశం నిర్వహించాలి. ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలని ఎసిసి స్వయంగా పాకిస్తాన్ ను అడిగింది.


 కానీ పాకిస్తాన్లో అయితే తాము టోర్నీ నుంచి తప్పుకుంటాము అంటూ భారత క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. టోర్నీని తటస్థ వేదికకు మార్చాలని చెప్పింది. దీనిపై ఎసిసి స్పందన ఏంటి..  ప్రపంచ క్రికెట్లో శక్తివంతమైనంత మాత్రాన భారత్కు మేము సేవకులమా.. వారు చెప్పింది ప్రతిదీ మేము వినాలా.. కచ్చితంగా పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ను నిర్వహించాల్సిందే.. దానికోసం ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అంటూ రమిజ్ రజా వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో ఉన్నత స్థానంలో ఉంది. జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు.  కాబట్టి మాకు తగినంత మర్యాద ఇవ్వండి అంటూ రమిజ్ రజా వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: