145ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. పాకిస్తాన్ చెత్త రికార్డు?
ఎక్కువ మంది బ్యాట్స్మెన్లు క్రీజులో పాతుకుపోయి ఇక నిలబడిన చోటు నుంచే బంతిని ఎదుర్కోవడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. కేవలం కొంతమంది బ్యాట్స్మెన్లు మాత్రమే కొన్ని కొన్ని సార్లు రిస్క్ చేసి చివరికి స్టంప్ అవుట్ రూపంలో వికెట్లు కోల్పోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో మాత్రం ఒక అరుదైన రికార్డు నమోదయింది అని చెప్పాలి. సాధారణంగా టెస్ట్ ఫార్మాట్లో ఒక స్టంప్ అవుట్ చూడడమే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఏకంగా పాకిస్తాన్ తోలి రెండు వికెట్లను కూడా స్టంప్ అవుట్ రూపంలో కోల్పోవడం అందరిని ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి.
అంతేకాదు 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇక ఒక చెత్త రికార్డులను నమోదు చేసింది పాకిస్తాన్ జట్టు. న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్టులో ఫస్ట్ ఇన్నింగ్స్ లో భాగంగా పాకిస్తాన్ తొలి రెండు వికెట్లను స్టంప్ ఔట్ రూపంలో కోల్పోయింది అని చెప్పాలి. అయితే 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక టెస్టులో తొలి రెండు వికెట్లు స్టంప్ ఔట్ రూపంలో జరగడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ ఆటగాళ్లు అబ్దుల్లా షఫీక్ 14 బంతుల్లో ఏడు పరుగులు చేసి స్టంప్ ఔట్ రూపంలో పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత షాన్ మసూద్ 10 బంతుల్లో మూడు పరుగులు చేసి ఇక స్టంప్ ఔట్ రూపంలోనే వెనుతిరిగాడు. ఇక తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది పాకిస్తాన్ జట్టు.