అలాంటి క్రికెటర్స్.. అరటిపండ్ల బండి పెట్టుకోండి : కపిల్ దేవ్
ఏకంగా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా ఇక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తూ ఉన్న నేపథంలో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో విశ్రాంతి తీసుకోవడం కాదు ఐపీఎల్లో విశ్రాంతి తీసుకోవాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఇప్పుడు గత కొంతకాలం నుంచి టీమిండియా లోని కొంతమంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు కపిల్ దేవ్. అతను చేసిన వ్యాఖ్యలు కష్ట ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.
ఒక స్పోర్ట్స్ ఛానల్ లో ఇండియన్ క్రికెటర్లను ఉద్దేశించి మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడుతూ.. 100 కోట్ల మంది భారత ప్రజల తరఫున ఆడుతున్న క్రికెటర్స్ కు ప్రెషర్ ఉండడం సహజం. అయితే ఆ ఒత్తిడిని తట్టుకొని ప్రతి ఒక్క క్రికెటర్ నిలబడాల్సిన అవసరం ఉంటుంది. ఒత్తిడితో పాటు ప్రజల అభిమానం కూడా ఉంటుంది అంటూ కామెంట్లు చేశాడు. ఒకవేళ ఇలా భారత జట్టులో కొనసాగుతూ ఒత్తిడి తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అరటి పండ్లు బండి పెట్టుకోవడం లేదా కోడిగుడ్లు అమ్ముకోవడం లాంటివి చేయాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.