మహిళల టీ 20: పరువుకోసం ఇండియా ఆఖరి పోరాటం !
ఈ గ్రౌండ్ లోనూ పరుగుల వరద ఖాయంగా తెలుస్తోంది. ఆస్ట్రేలియా మహిళలు బౌలింగ్ లో పర్వాలేదనిపిస్తున్న బ్యాటింగ్ లో మాత్రం అందరూ తమ సత్తా చాటుతున్నారు. ఇండియా బౌలర్లను తుత్తునియలు చేస్తూ గత నాలుగు మ్యాచ్ లలోనూ పరుగులు పిండుకున్నారు. ముఖ్యంగా మూనీ, మెగ్రాత్ , హీలీ , పెర్రీ , గార్డెనర్ మరియు హరీష్ లు రాణించారు. ఇక ఓడిపోయిన మూడు మ్యాచ్ లలోనూ ఇండియా గెలుపు ముంగిట వరకు వచ్చి బోర్లా పడింది. సరైన ముగింపు ఇచ్చే ఆటగాళ్లు లేకపోవడమే ఇండియా బలహీనత అన్ని చెప్పాలి. ఇక ఈ సిరీస్ మొత్తం కూడా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆశించిన విధంగా రాణించలేదు.
ప్రస్తుతం జరుగుతున్న ఆఖరి మ్యాచ్ లో అయినా గెలిచి సిరీస్ ను 2-3 తో ముగించి పరువును కాపాడుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఆస్ట్రేలియా జోరు చూస్తుంటే ఈ మ్యాచ్ లో కూడా ఖచ్చితంగా 170 కి పైగా పరుగులు సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా ఎంత స్కోర్ చేసినా ఇండియా ఛేదిస్తుందా చూడాలి. ఈ మ్యాచ్ లో వరుసగా ఫెయిల్ అవుతున్న స్మృతి మందన్న , రోడ్రిగస్ మరియు హర్మన్ లు రాణించాల్సి ఉంది.