శుభమన్ గిల్ సెంచరీ.. అరుదైన రికార్డ్?
ఇక ఇప్పుడు శుభమన్ గిల్ సైతం సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు అన్న విషయం తెలిసిందే. టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో 20 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయిన.. ఇక రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం 110 పరుగులు చేసి అదరగొట్టాడు. 152 బంతుల్లో ఇలా సెంచరీ పూర్తి చేసుకున్నాడు శుభమన్ గిల్. పూజార సైతం సెంచరీ తో చెలరేగిపోవడంతో టీమిండియా ఎంతో అలవోకగా భారీ స్కోరువైపు దూసుకుపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీ నమోదు చేసిన శుభమన్ గిల్ ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు.
ఇలా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ తో మెరిసిన శుభమన్ గిల్.. ఈ ఏడాది టీమిండియా తరఫున సెంచరీ బాదిన తొలి ఓపెనర్గా రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు టీమిండియా ఓపెనర్లలో ఒక్కరు కూడా సెంచరీ చేయలేదు. ఇక రెండు సార్లు అర్ధ సెంచరీలు మాత్రమే చేయగలిగారు అని చెప్పాలి. జట్టులో ఉన్న సీనియర్లకు సైతం సాధ్యం కాని రికార్డును అటు యువ ఆటగాడు శుభమన్ గిల్ సాధించాడు అని చెప్పాలి. ఇక శుభమన్ గిల్ అద్భుతమైన సెంచరీ నేపథ్యంలో అతనిపై మాజీ ఆటగాళ్లందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.