గిల్ సెంచరీ.. ఒకే ఏడాదిలో రెండు.. వారెవ్వా?
ఈ క్రమంలోనే ఇక శుభమన్ గిల్ ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మనిషిలో టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్ తన కెరీర్ లోనే అత్యుత్తమమైన ప్రదర్శన చేశాడు. ఏకంగా సెంచరీ తో చలరేగిపోయి టెస్ట్ ఫార్ముట్ లో తన కెరీర్ లో మొదటి సెంచరీ నమోదు చేశాడు. ఒకవైపు ఆచితూచి ఆడుతూనే మరోవైపు ఇక సరైన బంతులను బౌండరీలు తరలిస్తూ రెచ్చిపోయాడు శుభమన్ గిల్. ఈ క్రమంలోనే 148 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి.
అయితే ఓపెనర్ గా బరిలోకి దిగిన శుభమన్ గిల్ మొదట ఎంతో నెమ్మదిగా బ్యాటింగ్ ఆరంభించాడు. కాస్త క్రీజులో కుదురుకున్న తర్వాత మాత్రం బ్యాట్ తో విజృంభించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ బౌలర్లపై సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. పది ఫోర్లు మూడు సిక్సర్లతో 110 పరుగులు చేసి అదరగొట్టిన శుభమన్ గిల్ చివరికి మెహది హసన్ బౌలింగ్లో ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు అని చెప్పాలి. ఈ ఏడాది అదిరిపోయే ఫామ్ లో కొనసాగిస్తున్న శుభమన్ గిల్ అంతకుముందు వన్డే ఫార్మాట్లో కూడా సెంచరీ సాధించాడు. ఈ ఏడాది ఆగస్టులో జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో వన్డేలో గిల్ సెంచరీ చేయగా నేడు టెస్టుల్లో మొదటి సెంచరీ నమోదు చేశాడు.