రోహిత్, పంత్.. పూజారాను చూసి నేర్చుకోలేమో?

praveen
ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇటీవల జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో చటేశ్వర్ పూజార తన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. గతంలో ఫామ్ కోల్పోయి భారత జట్టుకు ఎన్నో రోజులపాటు దూరమయ్యాడు ఛటేశ్వర్ పూజారా. ఇక ఇటీవల కాలంలో భారత జట్టులో ఎంతోమంది యువ ఆటగాళ్ల హవా పెరిగిపోయిన నేపద్యంలో సీనియర్ ప్లేయర్ అయినా చటేశ్వర్ పూజారకు ఇక భారత జట్టులో చోటు దక్కడం అసాధ్యమని అందరూ భావించారు.

 కానీ ఊహించని రీతిలో చటేశ్వర్ పూజార అదరగొట్టాడు అని చెప్పాలి. చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో 90 పరుగులు చేసి మళ్లీ పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు. 203 బంతుల్లో  11 ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో ఇక 90 పరుగులను చేశాడు అని చెప్పాలి. ఒకవైపు వికెట్లు పడుతున్న ఒత్తిడికి లోను కాకుండా పూజార తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు అని చెప్పాలి. అయితే ఇక ఫామ్ కోల్పోయిన సమయంలో ఇంట్లో కూర్చోకుండా ఏకంగా ఇంగ్లాండ్ కౌంటిలలో ఆడి నెమ్మదిగా ఆడుతాడు అని పూజార మీద ఉన్న ముద్ర తొలగిపోయేలా చేసుకున్నాడు. సరికొత్త షాట్లతో సెన్సేషన్ సృష్టించి సెంచరీలతో చెలరేగిపోయాడు.

 దీంతో భారత సెలక్టర్లు మరో ఛాన్స్ లేకుండా చేసి ఇక మళ్ళీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పాలి. ఇక వచ్చి రాగానే మళ్లీ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ రిషబ్ పంతులు పూజారానూ చూసి నేర్చుకోవాలని కొంతమంది అభిమానులు సూచిస్తున్నారు.  ఫామ్ కోల్పోయినప్పుడు ఇంట్లో కూర్చోవడం కాదు దేశ వాళి టోర్నీలో ఆడి మళ్లీ మునుపటి ఫామ్ ని సాధించాలి అంటూ చురకలంటిస్తున్నారు. గత కొంత కాలం నుంచి ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న రోహిత్, రిషబ్ పంతు.. దేశవాళీ టోర్నీలలో ఆడి మళ్ళీ ఫామ్ సాధించి భారత జట్టులోకి వస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: