నా కెరియర్ లో.. ఆ మ్యాచ్ ఫుల్ ఎంటర్టైనింగ్ : స్మృతి మందానా
ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన రెండవ టి20 మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే నువ్వా నేను అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్లో ఏకంగా రెండు జట్లు కూడా సమానమైన స్కోర్ చేశాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరిగింది. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 పరుగులు చేయగా.. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు మాత్రం 16 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా విజయం సాధించింది.
ఈ క్రమం లోనే ఆస్ట్రేలియా తో రెండవ టి20 మ్యాచ్ ఎంత ఉత్కంఠ భరితంగా జరగడం గురించి ఇక భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ గా కొనసాగుతున్న స్మృతి మందాన తన అనుభవాన్ని వెల్లడించింది. తన కెరీర్ లోనే మోస్ట్ ఎంటర్టైనింగ్ మ్యాచ్లలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టి20 మ్యాచ్ ఒకటి అంటూ తెలిపింది. ముంబైలో ఆస్ట్రేలియా తో జరిగిన ఈ మ్యాచ్ చూసేందుకు 45000 మంది ప్రేక్షకులు వచ్చారు. హై స్కోరింగ్ వికెట్లను చూడటం ఎంతో ఉత్సాహంగా ఉంది ఈ విజయానికి అటు ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం అంటూ చెప్పుకొచ్చింది.