మా సక్సెస్ సీక్రెట్ అదే : హర్మన్ ప్రీత్

praveen
ఇటీవల కాలంలో టీమిండియా మహిళలు జట్టు ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పురుషుల క్రికెట్కు తాము ఆడే క్రికెట్ ఎక్కడ తక్కువ కాదు అన్న విషయాన్ని ప్రతి మ్యాచ్ లో కూడా నిరూపిస్తూ ఉన్నారు మహిళా క్రికెటర్లు. ఏకంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే మిథాలీ రాజ్ తర్వాత ఇక జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న హార్మన్ ప్రీత్ కౌర్ ఒకవైపు జట్టులో కీలక ప్లేయర్గా మంచి ప్రదర్శన చేస్తూనే మరోవైపు తన వ్యూహాలతో ఇక కెప్టెన్గా జట్టును ముందుకు నడిపిస్తూ ఉంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే హార్మన్ ప్రీత్ కౌర్ అటు కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇక టీమిండియా ఉమెన్స్ జట్టులో దూకుడు కాస్త పెరిగిపోయింది అని చెప్పాలి. అయితే మరికొన్ని రోజుల్లో టి20 ఉమెన్స్ వరల్డ్ కప్ కోసం అటు భారత మహిళల జట్టు సిద్ధమవుతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న తరుణంలోనే ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడబోతుంది టీమిండియా అమ్మాయిల జట్టు. ఈ క్రమంలోనే ముంబై వేదికగా డిసెంబర్ 9వ తేదీన ఇక ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే  ఇటీవలే మీడియాతో మాట్లాడిన టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ ఇక తమ విజయాల వెనుక ఉన్న సీక్రెట్ గురించి అసలు విషయాలను చెప్పుకొచ్చింది.

 సాధారణంగా జట్టులో కొందరు తమకు తాముగా గొప్ప ప్రదర్శన చేసేవారు ఉంటారు. మరి కొందరికి మాత్రం ప్రోత్సాహం అవసరం ఉంటుంది. వారిని కూడా అందరితో సమానంగానే చూడాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది జట్టు సభ్యులకు నా శక్తి సామర్ధ్యాలపై పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఫీల్డ్ లో ఉన్న సమయంలో నాకు ఎక్కడ వెనక్కి తగ్గే అవసరం రాదు అంటూ హర్మన్ ప్రీత్ చెప్పుకొచ్చింది. ఇక ప్రతి టోర్నమెంట్లో కూడా మేము ఊహించిన దాని కంటే మెరుగైన ప్రదర్శన చేయడానికి ఇది మాకు ఎంతగానో తోడ్పడుతుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక నాతో ఏ విషయం అయినా సంకోచం లేకుండా జట్టులోనే సభ్యులందరూ కూడా పంచుకుంటారు. కాబట్టే నేను జట్టును సమర్థవంతంగా నడిపించగలుగుతున్నాను. ఒకవేళ వాళ్ళు నాతో ఏ సమస్య చెప్పకపోతే సమస్యలు ఎలా పరిష్కరించగలను అంటూ తెలిపింది. ఇలా జట్టును కలిసికట్టుగా ఉంచడంలోనే విజయ రహస్యం దాగి ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: