
ఐపీఎల్ : పవర్ హిట్టర్ లకే దిక్కు లేదంటే.. మధ్యలో ఈయనొకడు?
ఇలా ఎన్ రోల్ చేసుకున్న వారిలో యువ ఆటగాళ్లు కూడా ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే ఇటీవల ఏకంగా ఇంగ్లాండ్ జట్టులో కొనసాగుతున్న టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ గా మారిన జో రూట్ సైతం అటు ఐపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొంతకాలం నుంచి ఆటలో వేగం తగ్గి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి దూరంగా ఉంటున్నాడు రూట్. టెస్ట్ ఫార్మాట్లో రెగ్యులర్గా ఆడుతూ అడపాదడపా వన్డేలలో మాత్రమే తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
ఒకవేళ ఇప్పుడు ఐపీఎల్ లో అవకాశం వస్తే సత్తా చాటి మళ్ళీ తిరిగి జాతీయ జట్టులో పరిమిత ఓవర్ల ఫార్మాట్ టీమ్ లో కూడా చోటు సంపాదించుకోవాలని భావిస్తూ ఉన్నాడు. అయితే అతని ఆలోచన క్లియర్ గానే ఉన్నప్పటికీ ఐపీఎల్లో అతన్ని కొనుగోలు చేసేందుకు ఎవరు ముందుకు వస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే కేన్ విలియమ్సన్ లాంటి ఆటగాడినే మాకు వద్దు అంటూ సన్రైజర్స్ వదులుకుంది. ఎంతోమంది పవర్ హిట్టర్స్ ని కూడా ఆయా జట్ల యాజమాన్యాలు వేలంలోకి వదిలేసాయ్. అలాంటిది పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి దూరంగా ఉన్న జో రూట్ ని ఎవరైనా పట్టించుకుంటారా అనే ప్రశ్న తెర మీదికి వస్తుంది.