విజయ్ హజారే ట్రోఫీ : కోహ్లీ రికార్డు సమం చేసిన యువ ప్లేయర్?

praveen
ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన దేశవాలి టోర్ని అయిన విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా యువ ఆటగాళ్లందరూ కూడా అదరగొడుతున్నారు అని చెప్పాలి. ఇక ఈ టోర్నీలో ఇక సెంచరీల మోత మోగిస్తూ తమ జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ అద్భుతమైన ప్రతిభతో టీమిండియా ఫ్యూచర్స్ స్టార్స్ తామే అన్న విషయాన్ని నిరూపిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్లు రికార్డులను బ్రేక్ కూడా చేస్తున్నారు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఒక అరుదైన రికార్డు నమోదయింది. ఏకంగా తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు జగదీషన్ నారాయన్ ఇటీవల ఏకంగా విజయ హజారే ట్రోఫీలు ఒకే సీజన్లో 4 సెంచరీలు సాధించిన రికార్డును కొల్లగొట్టాడు. అయితే గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కానీ ఇప్పుడు ఈ రికార్డును  సమం చేశాడు జగదీశన్. ఇటీవలే హర్యానాతో జరిగిన మ్యాచ్లో 123 బందులు 128 పరుగులు చేశాడు. కాక 2008-09 విజయ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు చేసి 534 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

 అయితే ఇలా విజయ్ హజారే ట్రోఫీలో ఒకే సీజన్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ జగదీషన్  మాత్రమే కాదు రుతురాజు గైక్వాడ్ పృథ్విషా, దేవదత్ పడిక్కాల్ కూడా ఉన్నారు. ఇటీవల హర్యానాతో జరిగిన మ్యాచ్లో జగదీషన్ మరో అరుదైన రికార్డును కూడా అందుకున్నాడు. లిస్టు ఏ క్రికెట్లో కుమార సంగకర, ఆల్విరో పీటర్సన్, పడిక్కాల్ తర్వాత నాలుగు సెంచరీలు బాదిన ఆటగాడిగా నిలిచాడు  ఇప్పటివరకు 41 లిస్టు ఏ మ్యాచ్ లు ఆడిన జగదీషన్ 1782 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఆరు అర్థ సెంచరీలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: