పొలార్డ్ కొత్త అవతారం.. మళ్లీ ముంబై ఇండియన్స్ తోనే?
తాను ముంబై ఇండియన్స్ జట్టు తరఫున కాకుండా మరో టీం తరఫున ఆడేందుకు సిద్ధంగా లేను అంటూ తెలిపాడు. అయితే ఇటీవలే ఏకంగా ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన కిరాన్ పొలార్డుతో క్రికెట్ సంబంధాలను కొనసాగించాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తుంది అన్నది తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఏకంగా ముంబై ఇండియన్స్ పేరును నిలబెట్టిన కిరణ్ పోలార్డ్ జట్టు నుంచి తప్పుకోవడాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలోనే అందరికీ ఒక గుడ్ న్యూస్ అందింది అని చెప్పాలి.
ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా కొనసాగమని ముంబై ఫ్రాంచైజీ యజమానులు అయినా నీత అంబానీ, ఆకాష్ అంబానీ కోరారు అంటూ ఇటీవలే కిరణ్ పోలార్డు చెప్పుకొచ్చాడు. అయితే మరోవైపు ఐపిఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్ ను నీత అంబానీ ప్రశంసలతో ముంచేసారు అని చెప్పాలి. ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతంగా నిలవడం వెనుక పోలార్టు పాత్ర ఎంతో ఉందని పొలార్డ్ సేవలు నిరూపమానమని ప్రశంసలు కురిపించడం గమనార్హం. అయితే 2023 సీజన్ నుంచి పొలార్డ్ ఏకంగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ గా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.