అతన్ని సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది : వీరేంద్ర సెహ్వాగ్
ఇకపోతే ఇక ఈ న్యూజిలాండ్ సిరీస్ లో భాగంగా మొన్నటి వరకు టీం ఇండియాలో చోటు కోల్పోయిన యువ ఆటగాళ్లకూ ఎంతో మందికి అవకాశం దక్కింది అని చెప్పాలి. న్యూజిలాండ్ పర్యటన అటు యువ ఆటగాళ్లు అందరికీ కూడా ఒక మంచి అవకాశం అని న్యూజిలాండ్ పర్యటనలో బాగా రానిస్తే రానున్న రోజుల్లో టీమ్ ఇండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉందని సలహాలు ఇస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు. అదే సమయంలో న్యూజిలాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో మరికొంతమంది ఆటగాళ్లు ఉంటే బాగుంటుంది అని దానిపై కూడా అటు మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.
ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న పృద్విషాను సెలెక్టరు పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టాడు. అతను చివరగా టీమిండియా తరఫున గత ఏడాది టీ20లలో ఆడాడు. ఇప్పుడు జట్టుకు పృద్వి షా అవసరం ఎంతో ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. అతను విధ్వంసకర ఆటగాడు.. పవర్ ప్లే లో పరుగులు రాబట్టే సత్తా అతనికి ఉంది. న్యూజిలాండ్ పర్యటనలో అతని సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు.