మాకు మీకు తేడా ఇదే.. పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ కౌంటర్?

praveen
భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో మాత్రమే కాదు ప్రతి విషయంలో కూడా వైరం కొనసాగుతూ ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా కొన్ని కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్రీడల్లో కూడా ఇలాంటి వైరం ఉందేమో అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా భారత్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఉత్కంఠ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చిరకాల ప్రత్యర్థులుగా పేరు ఉన్నప్పటికీ ఇక ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రం స్నేహితుల్లాగానే మెలుగుతూ ఉంటారు.

 ఇలా ఇరు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు ఎంతో స్నేహభావంతో మెలుగుతూ ఉంటే.. ఇక గెలుపు ఓటములపై ఇక పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు మాత్రం ఎప్పుడూ ఇక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు టీమిండియా పై విమర్శలు చేద్దామా అన్నట్లుగా వేచి చూస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడంతో ఎంతోమంది  పాక్ మాజీలు అటు భారత జట్టుపై సెటైర్లు వేస్తూ ఉన్నారు. ఇక ఈ లిస్టులోకి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా వచ్చి చేరడం గమనార్హం.

 ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమి అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన షరీఫ్ 152/0, vs 170/0 అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అంటే 2021 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో, 2022 వరల్డ్ కప్ లో ఇక ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ప్రభావాన్ని చవిచూసింది అని అర్థం వచ్చే విధంగా పోస్ట్ పెట్టగా.. దీనిపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. మాకు మీకు తేడా ఇదే.. మేము మా ఆనందంతో సంతోషపడితే. మీరు మాత్రం పక్కవారి కష్టంతో సంతోషపడతారు.. అందుకే మీరు మీ సొంత దేశాన్ని బాగు చేసుకోలేకపోతున్నారు అంటూ పాక్ ప్రధానికి కౌంటర్ ఇచ్చాడు ఇర్ఫాన్ పఠాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: