భారత్ vs ఇంగ్లాండ్ మ్యాచ్.. పాత రికార్డులు ఏం చెప్తున్నాయంటే?
ఇక ఈ మ్యాచ్ లో భాగంగా అటు భారత జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా వరల్డ్ కప్ లో ఏదైనా మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇక రెండు జట్ల మధ్య గత గణాంకాలు ఏంటి అన్న విషయాన్ని ఎంతోమంది చూస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నవంబర్ 10వ తేదీన ఇంగ్లాండ్ టీం ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పాత గణాంకాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది తెగ ఆసక్తి చూపుతూ ఉన్నారు.
ఇప్పటివరకు టి20 ప్రపంచ కప్ లో గత గణాంకాలు చూసుకుంటే భారత జట్టు, ఇంగ్లాండ్ పై ఆదిపత్యం చెలాయించింది అని చెప్పాలి. టి20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడుసార్లు మ్యాచ్ జరిగింది. ఇక ఈ మూడు మ్యాచ్లలో రెండుసార్లు భారత జట్టు విజయం సాధిస్తే ఒకసారి ఇంగ్లాండు గెలిచింది.
2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ టీం ఇండియా మధ్య మ్యాచ్ జరుగగా భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.
2009లో టి20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ భారత్ మధ్య రెండోసారి మ్యాచ్ జరగవుగా ఉత్కంఠ భరితమైన పోరులో మూడు పరుగులు తేడాతో భారత్ విజయం సాధించింది.
ఇక 2012లో మరోసారి వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య మూడోసారి మ్యాచ్ జరగకుండా ఇక 90 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ భారత్ పై విజయం సాధించడం గమనార్హం. అయితే మొదటిసారి టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ రెండు జట్లు నాకౌట్ మ్యాచ్లలో తలపడుతూ ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి..