టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు తన ఆట తీరుతో తనను తాను ఎప్పుడో పరిచయం చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఇప్పటివరకు తన సాధించిన రికార్డులు విరాట్ కోహ్లీ పేరు ప్రపంచ క్రికెట్లో దద్దరిల్లిపోయేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ప్రపంచ క్రికెట్లో రికార్డుల విషయంలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న కోహ్లీ... ఇక అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆట విషయంలోనే కాదు ఫిట్నెస్ విషయంలో కూడా తనకు ఎవరూ సాటి లేరు అన్న విషయాన్ని నిరూపిస్తూ ఉంటాడు కోహ్లీ.
అయితే సాధారణంగా విరాట్ కోహ్లీ రికార్డుల కింగ్ అని అందరూ పిలుస్తూ ఉంటారు. అయితే కేవలం రికార్డుల్లో మాత్రమే కాదు ఇక వింతైన హావభావాలు పలికించడంలో కూడా విరాట్ కోహ్లీ కింగే అని అంటున్నారు కొంతమంది అభిమానులు. మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ వికెట్ పడినప్పుడు ఒకలా.. వికెట్ పడనప్పుడు మరోలా ఇలా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్క బంతికి ఒక్కో ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.
ఇక ఇటీవల జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే షాట్ ప్రయత్నించిన జింబాబ్వే బ్యాటర్ కొట్టిన బంతిని స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు కోహ్లీ. ఆ సమయంలో మోకాళ్లపై కూర్చొని చిరునవ్వుతో కోహ్లీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలెట్గా మారింది. ఇది చూసి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కోహ్లీకి మాత్రమే సాధ్యం. ఎక్కడి నుంచి తెస్తాడో ఈ వింత ఎక్స్ప్రెషన్స్ అంటూ కొంతమంది అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఆధిపత్యాన్ని చలాయించిన భారత జట్టు 71 పరుగుల తేడాతో విజయం సాధించి 8 పాయింట్ లతో గ్రూప్2 నుంచి మొదటి స్థానంలో ఉండి.. ఇక సెమి ఫైనల్లో అడుగుపెట్టింది.