అయ్యో పాపం.. రికీ పాంటింగ్ పప్పులో కాలేశాడే?

frame అయ్యో పాపం.. రికీ పాంటింగ్ పప్పులో కాలేశాడే?

praveen
సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ లు జరుగుతున్న సమయంలోనే మాజీ ఆటగాళ్లు రివ్యూలతో రెచ్చిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  అలాంటిది టీ20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు రివ్యూలు ఇవ్వకుండా ఎలా ఉంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపై ఎంతోమంది మాజీ ఆటగాళ్ల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఇక వివిధ స్పోర్ట్స్ ఛానల్స్ తో మాట్లాడుతూ సెమీఫైనల్ చేరే జట్లు ఏవి అన్న విషయంపై కూడా తమ అంచనాలను ముందే చెప్పేస్తూ ఉన్నారు.


 మరి కొంతమంది మాజీ ఆటగాళ్లు మరో అడుగు ముందుకు వేసి సెమి ఫైనల్ అడుగుపెట్టే జట్లు మాత్రమే కాదు ఫైనల్ లో అడుగుపెట్టే జట్లు ఏవి.. చివరికి వరల్డ్ కప్ విజేతగా నిలవబోయే టీం ఏది అన్న విషయాన్ని కూడా ముందుగానే చెప్పేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనె ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా తన రివ్యూ చెప్పేసాడు. ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ వన్ నుంచి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా గ్రూప్ 2 నుంచి ఇండియా సౌత్ ఆఫ్రికా సెమిస్ లో అడుగుపెడతాయని అంచనా వేశాడు.


 అంతేకాదు ఏకంగా ఆస్ట్రేలియా టీమిండియా జట్లు ఫైనల్లో తలబెడతాయి అంటూ బల్లగుద్ది మరి చెప్పాడు రికీ పాంటింగ్.  కానీ ఇప్పుడు మాత్రం రికీ పాంటింగ్ అంచనా తప్పయింది. ఫైనల్ కు వెళుతుంది అనుకున్న ఆస్ట్రేలియా కనీసం సెమి ఫైనల్లో కూడా అడుగుపెట్టకుండానే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. దీంతో రికి పాంటింగ్ రివ్యూ ను తెరమీదకి తీసుకువస్తూ అయ్యో పాపం రికీ పాంటిక్ సొంత జట్టు విషయంలోనే సరైన అంచనాలు వేయలేకపోయాడు అంటూ ఎంతో మంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: