ఐపీఎల్ లో కెప్టెన్ గా శిఖర్ ధావన్.. ఏ జట్టుకో తెలుసా?
ఈ క్రమంలోనే గత సీజన్లో చేసిన తప్పిదాలను మళ్లీ పునరావృతం చేయకుండా ఇక ఆయా జట్టు ఫ్రాంచైజీలు ఇక జట్టులోని ఆటగాళ్ల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నాయ్. ఈ క్రమంలోనే అటు జట్టులో ఉన్న ఆటగాళ్లు మాత్రమే కాదు కెప్టెన్లను కూడా మార్చి ఇక సరికొత్తగా ఐపీఎల్లో ఆటను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే డిసెంబర్లో ఐపీఎల్ వేలం జరగబోతుంది అన్న టాక్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లను వదులుకునేందుకు ఆయా జట్ల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. అయితే గతంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా రాహుల్ ఉండగా అతని జట్టు యాజమాన్యం వదులుకోవడమె కాదు అటు మయాంక్ అగర్వాల్ కు కెప్టెన్సీ అప్పగించింది.
అతను కెప్టెన్గా ఒక ఆటగాడిగా కూడా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఇక అతను కెప్టెన్సీ నుంచి తప్పించి ఇటీవల తరచూ టీమిండియా కెప్టెన్సీ అందుకుంటున్న శిఖర్ ధావన్ కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం నిర్ణయించింది. ఇక 2023 ఐపీఎల్ నుంచి అతను జట్టు పగ్గాలు చేపట్టబోతున్నాడట. ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్లో పంజాబ్ పేలువ ప్రదర్శన చేసి ఆరవ స్థానానికి పరిమితమైంది. తద్వారా కెప్టెన్ ను మార్చాలని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.