ప్రతిసారి కెప్టెన్ రొటేట్ చేయలేం.. అందుకే.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం?

praveen
గత ఏడాది టీ20 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే  కానీ ఆ తర్వాత వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టి20 కెప్టెన్సీ కి గుడ్ బై చెబుతూ విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడు.  ఆ తర్వాత సారధ్య బాధ్యతలను రోహిత్ శర్మ అందుకున్నాడు. ఆ తర్వాత  కొంతకాలంలోనే మిగతా రెండు ఫార్మాట్ల సారధ్య బాధ్యతలు కూడా అటు రోహిత్ శర్మ చేతుల్లోకి వచ్చేసాయి అని చెప్పాలి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా రోహిత్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎప్పుడు కూడా ఫుల్ టైం మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా అందుబాటులో ఉంది లేదు.

 టి20 ఫార్మాట్ కు రెగ్యులర్గా అందుబాటులో ఉంటున్న రోహిత్ శర్మ టెస్ట్, వన్డే ఫార్మాట్ కి మాత్రం తరచూ  రెస్ట్ పేరుతో దూరం అవుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే తరచూ కెప్టెన్సీ మార్పు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై బీసీసీఐ సీరియస్ గా దృష్టి పెట్టింది అన్నది తెలుస్తుంది. ఇక నాయకత్వం మార్పుపై ఇప్పటికే బీసీసీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందా అంటే మాత్రం అవుననే అంటున్నాయి బీసీసీఐ సన్నిహిత వర్గాలు.. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారు అయింది. అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎడిషన్ లో భాగంగా టీమిండియా ఎన్నో కీలక మ్యాచ్లో ఆడాల్సి ఉంది.

 ఈ క్రమంలోనే వన్డే, టెస్ట్ ఫార్మాట్ల మీదే దృష్టి సారించే విధంగా అటు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి సీనియర్ క్రికెటర్ల పై ఒత్తిడి తగ్గించే ఆలోచనలో ఉందట బీసీసీఐ ఈ క్రమంలోనే  రోహిత్ నుంచి టి20 కెప్టెన్సీ బదిలాయించే ఆలోచన చేస్తుందట. ఇక ప్రతిసారి రొటెట్ చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ప్రపంచక ముగిసిన తర్వాత టి20 కంటే వన్డే టెస్ట్ ల పైన ఎక్కువ దృష్టి సాధించాల్సి ఉంటుంది. కాబట్టి  రోహిత్ టి20 కెప్టెన్సీని హార్దిక్ లేదా కేఎల్ రాహుల్ లేదా రిషిబ్ పంత్ లకు బతిలాయించి ఇక రోహిత్ శర్మను వన్డే టెస్టులకు కెప్టెన్ గా కొనసాగించాలని అనుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: