ప్రాక్టీస్ మ్యాచ్లలో హీరో.. కానీ అసలైన మ్యాచ్ లో జీరో?

praveen
సాధారణంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ ప్రేక్షకులకు ఎంతలా ఎంటర్టైన్మెంట్ పంచాలో అంతకుమించి అనేరేజ్ లోనే క్రికెట్ కిక్ ఇచ్చింది అని చెప్పాలి. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి.

 ఇక పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఏకంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. భారత జట్టుకు ఓటమి ఖాయం అనుకున్న పరిస్థితి నుంచి ఏకంగా వీరోచిత పోరాటంలో జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. ఇక కోహ్లీ తో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా బాగా రానించి హాఫ్ సెంచరీ తో జట్టు విషయంలో కీలక పాత్ర వహించాడు.  కోహ్లీతో కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు అని చెప్పాలి. బౌలర్లు కూడా తమ వంతు పాత్ర పోషించారు.

 ఇక మొత్తం మ్యాచ్ లో టీమ్ ఇండియాను కష్టాల్లోకి నెట్టింది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మాత్రమే అని చెప్పాలి. వీరు భారీ పరుగులు చేస్తారనుకుంటే మళ్లీ విఫలం అయ్యి జట్టును కష్టాల్లోకి నెట్టారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అయితే బిగ్ స్టేజ్ లపై ఎక్కువగా రాణించలేకపోతున్నాడు. ప్రపంచ కప్ కి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో అర్థ సెంచరీలు సాధించి కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్.. పాకిస్తాన్ తో జరిగిన పోరులో మాత్రం విఫలమయ్యాడు. చిన్న జట్లపై పరుగులు సాధిస్తున్న బలమైన జట్లపై మాత్రం చేతులెత్తేస్తున్నాడు. ఆసియా కప్ లో కూడా కేఎల్ రాహుల్ ఇదే తీరులో విఫలమయ్యాడు. తర్వాత జరిగిన ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాలతో సిరీస్లలో మాత్రం మళ్లీ టచ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. ఇలా ప్రాక్టీస్ లో హీరోగా అధికారిక మ్యాచ్ లలో విలన్ గా మారిపోతున్నాడు కేఎల్ రాహుల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: